టాలీవుడ్ సినిమా దండయాత్ర ప్రపంచ దేశాల సినిమాలపై కొనసాగుతుంది. ఒక్కప్పుడు ఆ హిస్టరీ బాలీవుడ్ కు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఆ రాతను మారుస్తూ టాలీవుడ్ సినిమా ముందుంటుంది. ఒక్కపుడు తెలుగు సినిమాలు 100కోట్ల క్లబ్ లోకి చేరాయి అంటే ఆ సినిమాను ఆ స్టార్ హీరోను టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ గా చూసే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 100 ఏండ్లు సినిమా చరిత్ర ఉన్న ఇండియన్ సినిమాకు, టాలీవుడ్ కు 88ఏండ్ల సినిమా చరిత్ర ఉన్నది. ఇప్పుడు 100 కోట్లు 500కోట్లు కాదు 1000, 2000కోట్లుకు టాలీవుడ్ సినిమాలు చేరువవ్వుతునాయి. మొన్న రాజమౌళి దర్శకత్వంలో వచిన్న బాహుబలి సిరిస్ ఈ ఫీట్ ను సాదించింది. ఇంతకు ముందు దక్షిణాదికి పరిమితమైన ఆ రికార్డ్స్ ను బాహుబలి బ్రేక్ చేసింది. జపాన్ లో ఈ సినిమా అక్కడ రికార్డ్స్ ను సృష్టించింది.
విదేశాల్లో కూడా మొదట వాళ్ల సినిమాలు అక్కడ విడుదలైన తరువాతనే మన ఇండియాలో వాళ్ల సినిమాలు విడుదలవుతాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులో తెలుగు సినిమాలు అక్కడి సినిమాలతో పోటి పడి మరి విడుదల చేస్తున్నారు. ఇండియన్ సినిమా వలన మరో ప్రపంచ యుద్ధం వచ్చిన ఆశ్చర్యపోవలిసిన పనిలేదు. ఒక్క 2018లోనే భారతీయ సినిమా ఈ ఫీట్ ను సాదించిందంటే మాములు విషయం కాదు. రచయతల మనోభావాలు మారుతున్నాయి, దర్శకుల ఆలోచనుకు పదును పెరుగుతుంది. సినిమా స్కోప్ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పటికే బ్రిటన్, సింగపూర్, అమెరిక వంటి దేశాలో మన సినిమా ఆడుతుంది. అక్కడ డాలర్స్ ను కురిపిస్తున్నాయి. మున్ముందు కొరియా లో కూడా ఇండియన్ సినిమా చరిత్ర తిరగరాయవచ్చు అంటున్నారు. ఈ సంక్రాంతి వస్తున్న వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ మూవీ లు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి.కొన్ని కొత్త దేశాలు కూడా టాలీవుడ్ సినిమాను విడుదల చెయ్యడానికి ముందుకు వస్తున్నాయి. ఇవ్వని మంచి ఇండియన్ సినిమాకు మంచి పరిణామాలు.