వినయ విధేయ రామలో దమ్ము…!

Vinaya Vidheya Rama Releases On Jan 11

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా వినయ విధేయ రామ అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక్క పాట మాత్రం బ్యాలన్స్ ఉన్నది అంటున్నారు. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే వినయ విధేయ రామ టీజర్ కు కుడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ సాంగ్ కుటుంబ బంధాలు పెంచేవిధంగా రూపొందించారు. ఇప్పుడు ఆ సాంగ్ అందరిని ఆకటుకుంటుంది. ముఖ్యంగా మెగా ఫాన్స్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Vinaya-Vidheya-Ram

మరి కొందరు మాత్రం బోయపాటి, ఎన్టీఆర్, కాంబో లో వచ్చినా దమ్ము సినిమాను పోలివున్నది అని ఆ సాంగ్ లోని విజువల్స్ దమ్ము సినిమాలోని ఫ్యామిలీలాగే పెద్ద కుటుంబంతో ముడిపడి ఉన్నదని కొందరు ట్రోల్ చేస్తున్నారు.రామ్ చరణ్ లుక్, బోయపాటి, దమ్ము సినిమాను పోలి ఉన్నది అంటున్నారు. కథ పరంగా ఏమోగాని విజువల్స్ మాత్రం అలాగే ఉన్నాయి అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియర అద్వాని కథానాయకి గా నటిస్తున్నది. ఆర్యన్ రాజేష్. ప్రశాంత్,స్న్హేహ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కి వినయ విధేయ రామ విడుదల కానున్నది.