జకన్న ఇప్పటి నుండే జాగ్రత్త పడాలి…!

Rajamouli RRR Movie Updates

తెలుగు స్టార్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ మల్టీ స్టారర్ సినిమా రూపొందుతుంది. రాజమౌళి మొదటి నుండి ఆర్ ఆర్ ఆర్ చిత్రం పైన మంచి హైప్ తీసుకు వచ్చాడు. రాజమౌళి దర్శకతవ్వంలో వచిన్నా బాహుబలి చిత్రమే ఆర్ ఆర్ ఆర్ పైన హైప్ రావడానికి ముఖ్యకారణం. తెలుగు వాడి సత్తా ఏమిటో రాజమౌళి బాహుబలి చిత్ర రూపంలో ప్రపంచానికి తెలియజేశాడు. ప్రపంచం మొత్తం మీద వేలకోట్లు సాదించింది. కావునా ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ పైన ఆ మాత్రం అంచనాలు ఉంటాయి. బాహుబలి చిత్రం పిరియాడికల్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరిలో సినిమా పైన ఇంటరెస్ట్ ఉంటుంది. దానికి తోడు రాజమౌళి గ్రాఫిక్స్ మాయాజాలంతోడై సరికి సినిమాపై అంచనాలు పెరిగినాయి.

RRR-Launch-Event

ఏదైనా సినిమాను ప్రమోట్ చెయ్యాలి అంటే అది ఒక్క రాజమౌళికే చెందుతుంది. కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ పైన అంత హైప్ తిసుకురగాలడా అనే సందేహం లేకపోలేదు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం స్వాతంత్రం రాకముందు జరిగే స్టొరీ అయినప్పటికీ. ఇప్పటి రెగ్యులర్ లైఫ్ కి ఎంతో కొంత సంబంధం ఉంటుంది. బాహుబలి టైం కి తీసుకువచ్చినా హైప్ ను జక్కన ఇప్పుడు ఏమాత్రం తిసుకురాగలడు అనేది పెద్ద సవాల్. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కావునా ఆర్ ఆర్ ఆర్ ను సరిగ్గా ప్రమోట్ చేస్తే ఈజీగా గేటిన్ కాగలదు అంటున్నారు. లేకపోతె మాత్రం శంకర్ దర్శకత్వంలో వచిన్నా 2.ఓ చిత్రం లాగా కలెక్షన్స్ పరంగా వెనకపడుతుంది. 2.ఓ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నా సినిమా వసూళ్ళ పరంగా విజయ్ సర్కార్ సినిమాను కూడా క్రాస్ చెయ్యలేకపోయింది. దీనికి ముఖ్య కారణం సినిమా ప్రమోట్ చెయ్యకపోవడమే అంటున్నారు. అందుకే జక్కన్న ఇప్పటి నుండే ప్రమోషన్ విషయంలో జాగ్రత్త పడాలని అంటున్నారు.