Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అధికారికంగా ఎవరూ ధృవీకరించకపోయినప్పటికీ…
వారి ఇంట్లో జరిగే ప్రతి వేడుకను ఈ బాబానే నిర్వహిస్తారు. కొన్నిరోజుల క్రితం అనుష్క ఆశ్రమానికి వచ్చి బాబాను కలిసినట్టు కొందరు భక్తులు చెబుతున్నారు. వివాహానికి ముందు బాబా ఆశీర్వాదం తీసుకునేందుకే అనుష్క ఆశ్రమానికి వెళ్లినట్టు సమాచారం. అటు పెళ్లి వేడుక కోసం ఇప్పటికే విరాట్, అనుష్క కుటుంబ సభ్యులు, సన్నిహితులు వేర్వేరు మార్గాల్లోమిలాన్ కు చేరుకున్నారు. విరాట్ తరపున సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అనుష్క తరపున షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, ఆదిత్య చోప్రా సంగీత్ తో మొదలై మూడు రోజులపాటుజరిగే వివాహ వేడుకల్లో పాల్గొంటారని సమాచారం. ఇటలీ నుంచి తిరిగొచ్చాక నూతన దంపతులు ముంబైలో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు భారీ విందు ఇవ్వనున్నట్టు వార్తలొస్తున్నాయి.