ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌ను ఐసీసీ సోమవారం ప్రకటించగా.. బ్యాట్స్‌మెన్ విభాగంలో 928 పాయింట్లతో ఉన్న విరాట్… రెండో ర్యాంకులో ఉన్న స్మిత్ (911) కన్నా 17పాయింట్ల ముందంజలో ఉన్నాడు. కాగా, నయావాల్ చతేశ్వర్ పుజార (791) ఓ స్థానాన్ని కోల్పోయి ఆరో ర్యాంకుకు పడిపోగా, భారత టెస్టు వైస్‌కెప్టెన్ అంజిక్య రహానే (759) రెండు మెట్లు దిగి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ (827) ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. కివీస్‌తో ఆఖరి టెస్టులో ద్విశతకంతో చెలరేగిన అతడు..
మొత్తంగా 549పరుగులతో సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాట్స్‌మెన్ విభాగంలో పదో స్థానానికి చేరాడు. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా (794) ఆరోర్యాంకులో కొనసాగగా, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (772) తొమ్మిది, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ (904) అగ్రస్థానంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. కివీస్ పేసర్ వాగ్నర్ (852), విండీస్ సీనియర్ జేసన్ హోల్డర్ (830) ఆ తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(796) మార్చి 2018 తర్వాత మరోసారి తన కెరీర్ అత్యుత్తమ ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో టీమ్ఇండియా స్టార్ రవీంద్ర జడేజా రెండో ర్యాంకులో కొనసాగగా.. హోల్డర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ టీ20ల్లో కెప్టెన్‌గా వేయి పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వేగంగా(30 ఇన్నింగ్స్‌లు)ఈ ఫీట్‌ను చేరుకున్న కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. ఈ క్రమంలో ధోనీ(62 మ్యాచ్‌ల్లో 1112) రికార్డును అధిగమించాడు. దీనికి తోడు ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్‌ను దాటేస్తూ కోహ్లీ టాప్‌లోకి చేరాడు.