Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటికే లాలూ అవినీతి ఆరోపణలు, సీబీఐ దాడులతో అట్టుడుకున్న బీహార్లో ఇప్పుడు ఓ యూనివర్సిటీ వ్యవహారం కలకలం రేపుతోంది. బీహార్లో ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చాలా పేరుంది. అలాంటి వర్సిటీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రశ్నలు చూసి అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అదేమంటే రాజ్యాంగబద్ధంగానే వివరాలు అడిగామని మరింత వెటకారంగా జవాబిచ్చింది వర్సిటీ.
మీరు కన్యేనా..? మీకు భార్యలు ఎంతమంది..? మీ భర్తను కోల్పోయారా..? ఉద్యోగుల వివరాలు తెలుసుకోవడానికి ఇలాంటి సెన్సిటివ్ క్వశ్చన్స్ వేయడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రముఖ వర్సిటీలకు పైత్యం ముదరుతోందని విమర్శలు రావడంతో.. వర్సిటీ వర్గాలు స్పందించాయి. ఇలాంటి తికమక ప్రశ్నలు వేయడానికి వర్సిటీ చెప్పిన కారణం కూడా కామెడీగానే ఉంది తప్ప సీరియస్ గా లేదు.
ఉద్యోగి చనిపోతే క్లెయిమ్ ఎవరికి వెళ్లాలో తెలుసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు అడిగామని సమర్థించుకుంది వర్సిటీ. కానీ క్లెయిమ్ లోనే నామినీ పేరుంటుంది, ఉద్యోగి ఎవరి పేరు నామినీగా పెడితే వారికే ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి అమల్లో ఉంది. కానీ ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇప్పటికే హెచ్చార్డీ ఈ వ్యవహారంపై వివరణ కోరిందట.
మరిన్ని వార్తలు: