మూలాలపై దాడి చేసిన మోడీ

modi-targeting-congress-government-karnataka-state

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశంలో కాంగ్రెస్ ను పునాదులతో సహా పెకిలించడమే ధ్యేయంగా పెట్టుకున్న మోడీ.. గుజరాత్ కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ చేశారు. కర్ణాటకలో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆతిథ్యం ఇస్తున్న మంత్రి శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా ఏడున్నర కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ పట్టుబడింది. దీంతో సిద్ధరామయ్య సర్కారు డిఫెన్స్ లో పడిపోయింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలాంటి లెక్కల్లేని డబ్బు బయటకురావడం సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా మారింది. గుజరాత్ పంచాయితీని తమ రాష్ట్రంలో పెట్టారనే అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న సిద్ధరామయ్య ఇప్పుడు ఏకంగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాహుల్ ఆదేశంతో మోడీని తిట్టినా.. అవినీతిపరుడని బీజేపీ ప్రచారం చేస్తుందని ఆయన భయపడుతున్నారు.

ఇక్కడ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అహ్మద్ పటేల్ ను అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అమిత్ షా అన్నంత పనీ చేసేలా కనిపిస్తున్నారు. ఏదో రకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చీల్చాలని, ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సైలంట్ గా క్రాస్ ఓటింగ్ చేస్తారని గుజరాత్ లో టాక్ నడుస్తోంది.

మరిన్ని వార్తలు:

గోవా బీచుల్లో ఆ పని కుదరదిక