Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ హీరోలు ఈమద్య కాలంలో తెలుగులో ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ హీరోలు తెలుగు హీరోలకు గట్టి పోటీని ఇచ్చారు. కొందరు హీరోలు అయితే తమిళ డబ్బింగ్ సినిమా వస్తుందంటే తమ సినిమాలను ఆపిన సందర్బాలున్నాయి. కాని ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. తమిళంలో తెరకెక్కిన చిత్రాలు తెలుగులో ఆకట్టుకోలేక పోతున్నాయి. ఒక వేళ తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. తాజాగా విశాల్‌కు అదే పరిస్థితి నెలకొంది. గతంలో ఈయన నటించిన పు చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను రాబట్టాయి. కాని తాజాగా విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా వసూళ్లను రాబట్టలేక పోయాయి.
తాజాగా ఈయన హీరోగా నటించిన ‘అభిమన్యుడు’ చిత్రం తెలుగులో విడుదలైంది. సమంత హీరోయిన్‌గా నటించడంతో సినిమాపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా వచ్చాయి. తాజాగా విడుదలైన అభిమన్యుడు చిత్రంకు విశ్లేషకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దాంతో మంచి వసూళ్లు వస్తాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా అభిమన్యుడు సినిమా మినిమం కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది. ఈమద్య వచ్చిన డబ్బింగ్ సినిమాలు ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. వాటి దారిలోనే ఈ సినిమా కూడా ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతుంది. దాంతో పాటు డబ్బింగ్ సినిమాను చూసేదేముంది అంటూ కొందరు పక్కకు పెట్టేస్తున్నారు. అందుకే ఈ చిత్రంకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టలేక పోతుంది.