యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వరూపం 2’ చిత్రం ఈనెల 10న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొదట ఈ చిత్రంను ఆగస్టు 10న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇటీవల తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చనిపోవడంతో సినిమాను వాయిదా వేయాలని కమల్ భావించాడు. కమల్ నిర్ణయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు కూడా స్వాగతించారు. కాని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమా వాయిదాను ఒప్పుకునేది లేదని, ఇప్పటికే పబ్లిసిటీ చేయడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసిన కారణంగా ఇప్పుడు సినిమాను వాయిదా వేయడం అసాధ్యం అంటూ చెప్పుకొచ్చారు. దాంతో కమల్ హాసన్ వారి ఒత్తిడి మేరకు ముందుగా అనుకున్న ప్రకారం రేపు చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.
విశ్వరూపం చిత్రం వచ్చి ఆరు సంవత్సరాలు అయ్యింది. ఆ చిత్రం విడుదలైన తర్వాత ఈ చిత్రాన్ని మొదలు పెట్టిన కమల్, ఆరు నెలల్లో విడుదల చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కాని సినిమా నిర్మాత ఆర్థిక సంక్షభంలో చిక్కుకోవడంతో పూర్తి కాలేదు. కష్టపడి చేసిన మూవీని తన సొంత ఖర్చులతో విడుదల చేసేందుకు కమల్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై ఆయనకు చాలా నమ్మకం ఉందని, అందుకే ఈ చిత్రంను సొంత రిస్క్‌తో పూర్తి చేశాడు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి విశ్వరూపం 2 చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరుణానిధి చనిపోయిన కారణంగా థియేటర్లను రెండు రోజుల పాటు బంద్ చేయడం జరిగింది. రేపటి నుండి థియేటర్లు పున: ప్రారంభం కాబోతున్నాయి. కనుక విడుదలకు ఎలాంటి అడ్డు లేదని డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేయడం వల్ల చిత్రాన్ని విడుదల చేయాలని కమల్ నిర్ణయించుకున్నాడు. విశ్వరూపం చిత్రం పర్వాలేదు అన్నట్లుగా టాక్‌ను దక్కించుకుంది, మరి ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను దక్కించుకుంటుందో చూడాలి.