Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న మహానటి లో సావిత్రి వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చూపించబోతున్నారు. ఇందులో భాగంగా సావిత్రి నటించిన కొన్ని కీలక సినిమాల గురించి మహానటిలో ప్రస్తావించనున్నారు. ఆ క్రమంలో సావిత్రి నటించిన మాయాబజార్ లో సూపర్ హిట్టయిన వివాహ భోజనంబు సాంగ్ ను మహానటిలో రీమిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. వివాహ భోజనంబు పాటను ఘంటశాల సంగీత దర్శకత్వంలో మాధవపెద్ది సత్యం పాడారు. ఎస్వీరంగారావు, సావిత్రి ఆనాటి పాటలో నటించగా…మహానటిలోని పాటలో ఎస్వీఆర్ పాత్రలో నటిస్తున్న మోహన్ బాబు, సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేశ్ కనిపించనున్నారు. వివాహ భోజనంబు పాటను ఆధునిక టెక్నాలజీ సాయంతో అత్యద్భుతంగా తెరకెక్కించాలని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.