Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలయ్య, పరిటాల మధ్య వార్ జరిగే అవకాశం ఉందా ? వుంది. అయితే అది రాజకీయాల్లో కాదు సినిమాలో. ఇంతకుముందు పరిటాల జీవిత చరిత్ర ఆధారంగా రక్త చరిత్ర లో పరిటాల రవి పాత్ర పోషించాడు వివేక్ ఒబెరాయ్. అందులో వివేక్ పాత్ర పేరు ప్రతాప్ రవి. ఫస్ట్ పార్ట్ లో హీరోగా కనిపించే వివేక్ రెండో పార్ట్ కి వచ్చేసరికి నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఆ సెకండ్ పార్ట్ లో వివేక్ నటన బాగా నచ్చిందట తమిళ దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ కి. బాలయ్య 102 వ సినిమాని డైరెక్ట్ చేస్తున్న రవికుమార్ ఆ సినిమాలో కీలకమైన విలన్ క్యారెక్టర్ కోసం వివేక్ ని సంప్రదించారట. ఆయన గనుక ఓకే అంటే బాలయ్యతో పరిటాల పాత్ర వేసిన వివేక్ కి యుద్ధం తప్పదు కదా.