అయితే ఈ కేసును రెండ్రోజుల్లోనే చేధించిన విశాఖ పోలీసులు ఆరుగురు నిందితులను తాజాగా రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను వైజాగ్ ఫోర్త్ టౌన్ పీఎస్ ఇన్‌ఛార్జి సీఐ కోరాడ రామారావు తాజాగా తెలిపారు. విశాఖ అక్కయ్యపాలెం చెక్కుడురాయి భవనం సమీపంలో చనిపోయిన దివ్య ఘటనపై తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. దీంతో దివ్యతో వసంత అనే మహిళ కొద్ది నెలలుగా వ్యభిచారం చేయిస్తోందని.. ఈమధ్య ఇద్దరి మధ్య డబ్బు పంపకాలకు సంబంధించి భేదాభిప్రాయాలు వచ్చాయని.. వసంత తన చెల్లెలు మంజు, తల్లి ధనలక్ష్మి, మరిది సంజయ్ సహకారంతో దివ్య కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో వస్త్రాలు కుక్కి గదిలో బంధించారు. అలాగే.. శరీరంపై 33 చోట్ల వాతలు పెట్టి అతి క్రూరంగా హింసించి చంపారు. కాగా ఆ బాధలు తట్టుకోలేక నీరసించిపోయిన దివ్య ప్రాణాలు విడిచింది. కాగా ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితురాలైన వసంత(జ్యోతి)తో పాటు, ఆమె సోదరి మంజు(సంధ్య), తల్లి ధనలక్ష్మి, మరిది సంజయ్, దివ్య పిన్ని కాంతవేణి, గీతపై 302, 201, 343, 324 ఐటీపీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.