‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ప్రివ్యూ…

Vunnadhi Okate Zindagi Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి , శ్రీవిష్ణు 

నిర్మాతలు  : స్రవంతి  రవికిషోర్ , కృష్ణ   చైతన్య 
దర్శకత్వం :  కిషోర్  తిరుమల 

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి  శ్రీ  ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ :  సమీర్  రెడ్డి 

ఎడిటర్ : శ్రీకర్  ప్రసాద్ 

 

రామ్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. సైలెంట్‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రంతో రామ్‌ నిర్మాతగా అవతారం ఎత్తాడు. పెదనాన్న స్రవంతి రవికిషోర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సినిమా పూర్తి అయ్యేంత వరకు ఈ చిత్రం గురించి లో ఫ్రొఫైల్‌ మెయింటెన్స్‌ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ విడుదల అయ్యాయో అప్పటి నుండి సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్‌ అయ్యింది.

సినిమాలో స్నేహం గురించి, ప్రేమ గురించి చెప్పిన డైలాగ్స్‌ యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి, రామ్‌ రెండు లుక్‌లు మరియు ఇద్దరు హీరోయిన్స్‌ కూడా సినిమాకు హైలైట్‌గా అవ్వబోతున్నాయి. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్‌ పాత్ర సినిమాకు ప్రాణం అంటూ దర్శకుడు కిషోర్‌ చేసిన ప్రకటన సినిమాపై అంచనాలను పెంచేసింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని సిద్దం చేశారు. సెన్సార్‌ బోర్డు నుండి కూడా ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రామ్‌ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం ఇది అంటూ అప్పుడే సినీ వర్గాల్లో కొందరు జోష్యం చెప్పేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఇప్పటికే యువతను ఉర్రూతలూగిస్తుంది. మొత్తంగా సినిమా కొత్తగా యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అనిపిస్తుంది.