ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఘర్షణ జరుగుతుంది. ఒక పక్క మూడు రాజధానులు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శరవేగంగా రాజధానుల అమలు ప్రక్రియలో బిజీగా సమయం గడుపుతున్నారు. అయితే ఈ సమయం లో అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని గత టీడీపీ ప్రభుత్వం ఫై ఆరోపణలు చేయడం తో అమరావతిలో ఆందోళనలు నెలకొన్నాయి.
అయితే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్లుగా తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడు నెలలుగా వైయస్ జగన్ తవ్వుతోంది అవినీతి కాదు,వైసీపీ ప్రభుత్వాన్నీ పూడ్చి పెట్టడానికి తవ్వుతున్న గొయ్యి అని విమర్శలు చేసారు. ఆధారాలు బయటపెట్టమని చెబుతుంటే అవే 4075 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
అయితే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఉప కమిటీ నివేదిక అందించిన ఆరోపణల ఫై జ్యూడిషియల్ ఎంక్వయిరీ కి మేము సిద్ధం, విశాఖ, విజయనగరంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఫై జ్యూడిషియల్ ఎంక్వయిరీ కి మీరు సిద్ధమా? అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు నారా లోకేష్.