బిగ్ బాస్ మొదటి ఎలిమినేట్ అయ్యేది అతనేనా ?

was-he-the-first-boss-of-big-boss-to-be-eliminated

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 తొలివారం పూర్తైంది. అయితే వారాంతం వచ్చిందంటే కంటెస్టెంట్ గుండెల్లో గుబులు మొదలౌతోంది. ఎందుకంటే ఈ 15 మందిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యేది శని, ఆదివారాల్లోనే. హోస్ట్ నాగార్జున దగ్గరుండి మారీ వీరిని సాగనంపే కార్యక్రమం ఉండటంతో తొలివారం ఎలిమినేట్ అయ్యేదెవరన్నదానిపై బుల్లితెర ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది.

ఇక తొలి వారం ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. 15 మందిలో మొత్తం ఆరుగుగు రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు తొలివారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కానున్నారు. అయితే వీరులో మొదట సేఫ్ జోన్‌లో ఉన్నది ఎవరైనా ఉన్నారా? అంటే ఆమె వితికా షెరు.

భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో కాంట్రివర్శి కంటెస్టెంట్‌గా మారారు. షో టాప్ రేటింగ్‌లో నడవాలంటే ఇలాంటి రేటింగ్ వనరు చాలా ముఖ్యం కాబట్టి వితికాను ఎలిమినేట్ చేసే సాహసం అయితే చేయరు. మిగిలిన ఐదుగురులో పునర్నవి, జాఫర్, హిమజలు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. గ్లామర్ పరంగా పునర్నవి, హిమజల సేవ్ చేసినా బాబా భాస్కర్‌తో కాంబినేషన్‌లో జాఫర్ కామెడీ పండించి హౌస్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

ఇక మిగిలిన హేమ, రాహుల్ విషయానికి వస్తే ఇద్దరి మధ్య రెండో రోజునుండే గొడవలు మొదలయ్యాయి. అయితే ప్రేక్షకులకు హేమ కంటే.. రాహుల్‌పైనే ఎక్కువ పాజిటివ్ నెస్ ఉండటంతో ఓట్లు పరంగా రాహుల్‌కి వస్తున్న ఓట్ల శాతమే ఎక్కువ. అయితే హేమ షోకి చాలా అవసరం.

రేటింగ్‌ను పరిగణలోకి తీసుకుంటే బిగ్ బాస్ నిర్వాహకులు రాహుల్ కంటే హేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ లెక్కన ఈవారం బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం తొలి కంటెస్టెంట్ అవకాశం సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కే ఉందని అంటున్నారు.