రిలయన్స్ జియో కొత్తగా మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది.నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న వారికి ఉచితంగా కూడా అందిస్తోంది. ఇప్పటికే
జియో ఫైబర్ ప్లాన్, జియో పోస్ట్ పెయిడ్ లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్లు ఉన్నప్పటికీ ప్రీపెయిడ్ ప్లాన్లు రావడం మాత్రం ఇదే తొలిసారి.
భారతదేశంలో జియోకు 40 కోట్లకు మందికి పైగా యూజర్లున్నారు. దీంతో వీరందరికీ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రాంతీయ భాషల్లో సినిమాలు,వెబ్ సిరీస్‌లను, ఎంటర్ టైన్మెంట్ టీవీ షోలను సైతం నెట్‌ఫ్లిక్స్‌లోఫ్రీగా చూడొచ్చు.
జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఎంతంటే..
కొత్తగా జియో ప్రవేశపెట్టిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ.1,099. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 2GB డేటా పొందుతారు. రెండో రీఛార్జ్ ప్లాన్లో మరింత ఎక్కువగా డేటా పొందొచ్చు. రూ.1,499తో 3GB డేటాను ఆస్వాదించొచ్చు. ఈ రెండు ప్లాన్లు వేర్వేరు ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అయితే వీటి కాల పరిమితి 84 రోజుల వరకు ఉంటుంది. జియో వెల్‌కమ్ ఆఫర్ ద్వారా అపరిమితంగా 5G డేటా లభిస్తుంది. అంతేకాదు అపరిమితమైన కాల్స్ మాట్లాడుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లోనే ఈ ప్లాన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను చూడొచ్చు.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మా యూజర్లకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి మేం కట్టుబడి ఉన్నామని జియో ప్లాట్‌ఫామ్ సిఇఒ కిరణ్ థామస్ తెలిపారు .నెట్‌ఫ్లిక్స్ తో గ్లోబల్ స్ట్రీమింగ్ కంపెనీ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని కిరణ్ థామస్ పేర్కొన్నారు. జియోతో పార్ట్నర్ షిప్ పొందడం భారతదేశంలో తమ ప్లాట్‌ఫారమ్ మరింత ఎక్కువ మందికి చేరువవుతుందని ఆశిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారి టోనీ జెమెకోస్కీ తెలిపారు.
ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఛార్జీలను ఓసారి పరిశీలిస్తే నెలకు రూ.149గా ఉంది. అదే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అంటే మొబైల్ లేదా టీవీలో లాగిన్ అయ్యే ప్లాన్ నెలకు రూ.199గా ఉంది.
ఇప్పటివరకు జియో మూడు నెలల(84 రోజులు) రీఛార్జ్ ప్లాన్ రూ.719, రూ.749గా ఉంది.నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కొత్తగా లాంఛ్ చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లకు ఉంటుంది కాబట్టి కొంతమేరకు ధరలు పెరిగాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా చూడాలనుకునే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.