మేము భారత్‌తో యుద్ధం కోరుకోవడం లేదు…

పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం ఈ దాడిని స్వయంగా చేసినట్లు అనిపిస్తోందని, ఈ దాడిలో పాకిస్తాన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. “మేము భారతదేశంతో యుద్ధం ప్రారంభించాలనుకోవడం లేదు, కానీ యుద్ధ పరిస్థితి తలెత్తితే పాకిస్తాన్ కూడా దానికి ప్రతిస్పందిస్తుంది. భారతదేశం నీటిని ఆయుధంగా ఉపయోగిస్తోంది” అని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం తనపై దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతోంది. అయితే భారతదేశాన్ని కూడా హెచ్చరిస్తూ.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది