తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా భద్రాద్రి, జగిత్యాల, ఖమ్మం, NLG, సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం జిల్లాల్లో వానలు పడతాయని చెప్పింది.
అటు ఏపీలో నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే రాబోయే మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని తెలిపింది.