హైదరాబాద్‌లో ఒక్కసారి మేఘాలు ఆవరించాయి. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. ఉదయం పూట వాన కురవడంతో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా వాన కురవడంతో తడిసిముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో నీళ్లు రహదారులపైకి వచ్చి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.
నగరంలోని కర్మన్‌ఘాట్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఉప్పల్, తార్నాక, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, బోరబండ, అల్లాపూర్, మధురానగర్, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, మైత్రివనం, మైత్రివనం, అమీర్‌పేట, పంజాగుట్ట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం మేడ్చల్, దుండిగల్‌లో వర్షం కురిసింది.
అకస్మాత్తుగా వాన కురవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు.. అసలే చలికాలం కావడం.. అందులోనూ వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.