వైరల్ : ఈ కరోనా వైరస్ పై ముందే వెబ్ సిరీస్

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచి మనం నెట్ లో పలు రకాల సమాచారం చూస్తూ ఉన్నాం. 100 ఏళ్ల క్రితం ఒక పుస్తకంలో ఈ కరోనా వైరస్ ని ప్రస్తావించారనీ.. బ్రహ్మంగారి కథలో దీన్ని ప్రస్తావించారని.. ఇలా అనేక రకాలుగా వింటుంన్నాం. అలాగే… కరోనా వైరస్ వ్యాప్తి కోసం గతంలోనే చాలామంది చర్చించారనే అంశాన్ని.. ప్రస్తావించిన విషయాలను చూశాం. కానీ మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ ని చూడవచ్చు. 2018 లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఒక వెబ్ సిరీస్ లో కోవిడ్-19 కరోనా వైరస్ ను గురించి వివరిస్తూ… ఆ స్థాయిలోనే ఒక సిరీస్ రావడం విశేషం.

అయితే ఇప్పుడు అది నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న పరిస్థితి. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ పేరు మై సీక్రెటేరియస్. ఇదొక సౌత్ కొరియన్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ను ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ టర్మనాలజీనీ అంతా కరోనా వైరస్ అని డాక్టర్స్ వివరించడం యాప్ట్ అవుతోంది. డెత్ 20శాతం ఉందంటూ కూడా ఆ వెబ్ సిరీస్ లో ఉన్న కొన్ని సీన్స్ చూస్తుంటే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యింది. ఇది మనం వెబ్ సిరీస్ లో చూడవచ్చు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది కూడా రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన అంశమే. డిసీజ్ 20 పర్సెంట్ డెత్ రేట్ ఉంటుందంటూ కూడా ఆ వెబ్ సిరీస్ లో డాక్టర్స్ మధ్య సంభాషణ జరిగిన తీరు యాప్ట్ అయింది. దీనికి ఒక్కటే ఒక మార్గమని.. ఇదొక మ్యుటేషన్ వైరస్ అని.. వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వెబ్ సిరీస్ లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం.. ఆ టెర్మినాలజీ కూడా సేమ్ ఉండటం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు సిచ్యువేషన్స్ డాక్టర్స్ మధ్య జరుగుతున్న వివరణ ఇది ఒక మ్యుటేషన్ వైరస్. ఒకరి నుంచి మరొకరి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.