శర్వానంద్ “మనమే” మూవీ నుంచి వెడ్డింగ్ సాంగ్ అవుట్ ..!

Wedding song out from Sharwanand
Wedding song out from Sharwanand "Maname" movie..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్ లు శర్వానంద్ అలాగే కృతి శెట్టిలు కలయికలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన లేటెస్ట్ క్లీన్ ఎంటర్టైనర్ మూవీ “మనమే”. మరి గ్లింప్స్ నుంచి మంచి బజ్ ను అందుకున్న ఈ మూవీ నుంచి ఇప్పుడు మేకర్స్ మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు. మరి ఒక వెడ్డింగ్ సాంగ్ గా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల గాత్రంతో వినేందుకు చాలా బాగుంది.

Wedding song out from Sharwanand "Maname" movie..!
Wedding song out from Sharwanand “Maname” movie..!

అలాగే హిట్ సంగీత దర్శకుడు హీషం అబ్దుల్ వహాద్ నుంచి మరో డీసెంట్ ట్రాక్ ను అందించాడని చెప్పాలి. అలాగే ఈ సాంగ్ లో శర్వానంద్ కాస్ట్యూమ్స్ కానీ కృతి తో తన కెమిస్ట్రీ కానీ చూసేందుకు ఇంప్రెసివ్ గా ఉన్నాయి . ఇలా ఒక మంచి వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్ గా ఇది కనిపిస్తుంది. ఇక ఈ మూవీ లో ఆయేషా ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జూన్ 7న రిలీజ్ కానున్నది .