వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని నమ్ముకున్న వాళ్లని గురి చూసి కొడుతున్నారు. చిలుకలూరి పేట మర్రి రాజేశేఖర్, పాయకరావుపేట గొల్ల బాబూరావు లాంటి వాళ్ల హడావుడి సద్దుమణగక ముందే ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్న పళంగా ఆయనను తొలగించేసి నాలుగు రోజుల కిందట పార్టీలో చేరిన మాజీ పోలీసు అధికారి ఏసురత్నంకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చేశారు. ఇలా చేసే ముందు లేళ్ల అప్పిరెడ్డి కనీస మాట మాత్రంగా కూడా చెప్పలేదు. దీంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. అభిమానుల అభిప్రాయాలు తెలుసుని దానికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రకటించారు.
అయితే ఇదంతా ఆ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకోడానికి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఆ నియోకవర్గంలో వైసీపిని ఓడించుకునేందుకు ఆయన వ్యూహాత్మకంగా అప్పిరెడ్డిని తప్పించినట్టు తెలుస్తోంది. అమిత్ షా నుంచి వచ్చిన ఆదేశాలు, బీజేపీ పార్టీతో ఉన్న ఒప్పందం ప్రకారం కన్నా లక్ష్మీ నారాయణను వచ్చే ఎన్నికల్లో గెలిపించటానికి, సొంత పార్టీలో తనను నమ్మిన బంటుకు షాక్ ఇచ్చి నట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కన్నా కోసమే జగన్ హ్యాండిచ్చాడా ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయటంతో ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్‌తో వైసీపీకి పడాల్సిన 20 వేలకు పైగా ఓట్లను చీల్చుకోవటంతో అప్పిరెడ్డి రెండోస్థానంలో నిలవాల్సి వచ్చింది.
ఓటమి అనంతరం కూడా అప్పిరెడ్డినే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో మమేకమై పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. వాస్తవానికి గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా బలం పుంజుకున్నాడని ఆ పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. ఈ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పిరెడ్డి లాంటి బలమైన నేతను కాకుండా, నిన్న మొన్న పార్టీ లో చేరిన బలహీన అభ్యర్ధి ఏసురత్నంను నియమించటం వెనుక, కన్నా లక్ష్మీ నారయణను గెలిపించే వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.