క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంలో మహేంద్ర సింగ్ ధోనీ గొప్పవాడుగా తెలిపారు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ధోనీతో కలిసి అప్పట్లో క్రికెట్ ఆడిన మహ్మద్ కైఫ్.. అతనికి ఫిట్నెస్ సహజసిద్ధంగా వచ్చిందని అన్నారు. అందరి క్రికెటర్ల వలె ధోనీ పెద్దగా జిమ్‌లో శ్రమించడని వెల్లడించిన కైఫ్.. బటర్ చికెన్, బిర్యానీలను అతను ఇష్టంగా తింటాడని అన్నారు. అయినప్పటికీ.. ధోనీ ఇలా ఫిట్‌గా ఉండటం ఆశ్చర్యకరమని తన అభిప్రాయాన్ని వ్యక్తేం చేశాడు.
అదేవిధంగా ‘వికెట్ల మధ్య ధోనీ చాలా వేగంగా పరుగు తీస్తాడని.. స్వతహాగా తాను కూడా అతనితో కలిసి సింగిల్స్, డబుల్స్ తీశానని.. అందుకే అలాంటివి గమనించినట్లు వివరించారు. అలాగే.. అతని వేగం అమోఘమంటూ కితాబిచ్చారు. అలాగే.. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో ధోనీనే ఫాస్టెస్ట్ రన్నర్ గా అభివర్ణించారు. ‘అతను పెద్దగా జిమ్‌కి వెళ్లడు.. బటర్ చికెన్, బిర్యానీలను ఇష్టంగా తింటాడు. అయినప్పటికీ.. అలా వేగంగా ఎలా వికెట్ల మధ్య పరుగు తీయగలుగుతున్నాడో..? ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను మంచి ఫిట్నెస్ ఉన్నానని అనుకునేవాడ్ని.. కానీ.. ధోనీది న్యాచురల్ ఫిట్నెస్’ అంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు మహ్మద్ కైఫ్.
అంతేకాకుండా మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. అదేమంటే.. ధోనీ తన ఫస్ట్ అంతర్జాతీయ మ్యాచ్‌లో మహ్మద్ కైఫ్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. అది కూడా డకౌట్. అదెలాగంటే.. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో లెగ్ గల్లీ దిశగా బంతిని నెట్టిన ధోనీ సింగిల్ కోసం కైఫ్‌ని పిలిచాడు. ఆ పిలుపునకి రెస్పాండ్ అయిన కైఫ్ కాస్త ముందుకు వచ్చి అనూహ్యంగా పరుగుకి నో చెప్పాడు. దాంతో అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన ధోనీకి మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం లేకపోవడంతో అలా డకౌట్ కావాల్సి వచ్చింది.