టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇక తాజాగా మహేష్ నటిస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా టైటిల్ పట్ల మహేష్ అభిమాని ఎవ్వరూ కూడా ఆనందంగా లేరు.. కానీ ఎక్కడో దర్శకుడు త్రివిక్రమ్ మాటల గారడీ, కథను నడిపించే విధానం పట్ల విశ్వాసంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా గురించి ఒక నిజం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు,ఈ సినిమా కోసం నిర్మాతలు రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. ఇక సినిమాలో కీలకం అయిన హీరో పాత్ర కోసం ఎంపిక అయిన మహేష్ బాబు పారితోషికంగా రూ. 78 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. కాగా దీనికి జీఎస్టీ అదనమని తెలుస్తోంది.
అయితే ఇది కేవలం ఇప్పటి వరకు వినిపిస్తున్నవార్తే గాని కావడం నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. .సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే ఇంత మొత్తాన్ని హీరో కే ఇస్తే .మిగిలిన ఆర్టిస్టులకి ఎలా ఇవ్వాలి? ఇక సినిమా ఏమి తీయాలి అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ కెరీర్ లో రెండు సినిమాలు రాగా ఒకటి హిట్ మరొకటి యావరేజ్ గా మిగిలాయి.ఇక ఈ మూవీ మంచి విజయం సాధించాలని ప్రేక్షకులు మరియు మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు .