పిండికి తగ్గట్టు రొట్టె అన్నట్టుగా.. మార్కెట్‌కి తగ్గట్టుగానే సినిమా వాళ్ల పారితోషకాలు ఉంటాయి. ఒకప్పుడు అయితే పెద్దగా మార్కెట్ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్.. వందల కోట్ల నుంచి వేల కోట్లకి మారింది. ప్రొడక్షన్ విలువ కూడా విపరీతంగా పెరిగింది. అన్నింటితో పాటుగా హీరో హీరోయిన్లు, ఆర్టిస్ట్‌లు, దర్శకుల పారితోషకాలు కూడా భారీగా పెరిగాయి.వెండితెరతోపాటు బుల్లితెర మార్కెట్ కూడా పెరిగింది.
యాంకర్ సుమ కనకాల.. ‘కనక’వర్షమే సుమీ యాంకర్లకు డిక్షనరీ లాంటిది యాంకర్ సుమ కనకాల. ఇప్పటి వరకూ తెలుగులో చాలామంది యాంకర్లు వచ్చారు.. వెళ్లారు. మహా అయితే కాదంటే పదేళ్లు వాళ్ల హవా నడిచింది. కానీ యాంకర్ సుమ.. హవా కంటిన్యూ అవుతూనే ఉంది. తన వాక్చాతుర్యంతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. ఇండస్ట్రీలో ఎంత మంది యాంకర్లు ఉన్నా.. తన స్థానం సుస్థిరం చేసుకుని నెంబర్ 1 యాంకర్‌గా నిలిచింది యాంకర్ సుమ. అయితే సినిమా అయినా పెద్ద సినిమా అయితే.. రెండు లక్షలు తక్కువ అయితే పారితోషకం ఉండదట.
అంతేకాదు.. ఎంత పెద్ద ఈవెంట్ అయినా యాంకర్ సుమ.. రెండు గంటలకంటే ఎక్కువ ఉండదు. ముందు ఆడియన్స్‌తో మాట్లాడటానికి.. బైట్స్ లాంటి వాటికి వేరే యాంకర్ ఉండాల్సిందే. టైట్ కాల్ షీట్స్ ఉన్నప్పుడు ఏదైనా పెద్ద ఈవెంట్ చేయాల్సి వస్తే.. యాంకర్ సుమ రెమ్యూనరేషన్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరుగుతుందట. యాంకర్ కదా. తన టైం అయ్యిందంటే వచ్చి కారు ఎక్కేస్తుందట. సినిమా ఈవెంట్‌కి అయితే రూ.2-5 లక్షలు కాగా.. టీవీ షోకి అయితే.. డేకి రూ.1 లక్ష వరకూ చార్జ్ చేస్తుందట సుమ. ఇక ప్రత్యేక ఇంటర్వ్యూలు.. ప్రమోషన్ ఇంటర్వ్యూలు అయితే రూ.5 లక్షలు పైమాటే. ఇక సినిమాల్లోనూ నటిస్తున్న సుమ.. సినిమాకి రూ.25 లక్షలపైనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట.
మొత్తానికి సినిమాలను పక్కనపెడితే.. ఆడియో ఈవెంట్లు, టీవీ షోలు, ఇంటర్వ్యూలతో నెలకి రూ. కోటి పైమాటేనట యాంకర్ సుమ సంపాదన. సినిమా సందడి ఉంటే మాత్రం కోటి రెట్టింపు అవుతుందట హాట్ అనసూయ.. రెమ్యూనరేషన్లోనూ టాప్ లేపిందిగా ఈ మధ్య అందాల ఆరబోతలో అన్ లిమిటెడ్ బోర్డ్ పెట్టేసిన అనసూయ.. పారితోషకం విషయంలో టాప్ గేర్‌లో దూసుకుని పోతుంది. అంతకు ముందు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్.. ఇతర టీవీ షోలతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ.. సినిమాల్లోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా పారితోషకం రెట్టింపు అయ్యింది. పది లక్షల నుంచి పాతిక లక్షల వరకూ అనసూయ పారితోషకం తీసుకుంటుందట.
అయితే పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత పడుతున్న రంగమ్మత్త. తనకి పాత్ర నచ్చితే మాత్రం రెమ్యూనరేషన్ గురించి ఆలోచించడం లేదట. ఇక టీవీ కార్యక్రమాలకైతే లక్ష నుంచి రెండు లక్షల వరకూ చార్చ్ చేస్తుందట. ఇక రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు.. వగైరా వగైరా అయితే రోజుకి రూ.5 లక్షల వరకూ పారితోషకం తీసుకుంటుందట అనసూయ. మొత్తంగా అనసూయ నెల సంపాదన.దాదాపు రెండు నుంచి మూడు కోట్లు పైనేనట. యాంకర్ రష్మి.. సంపాదనలోనూ ఎక్స్ ట్రా జబర్దస్తే జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకోవడంతో.. రష్మికి క్రేజ్ పెరిగింది.
నిజానికి అటు అనసూయ కానీ.. ఇటు రష్మి కానీ.. తెలుగు మాట్లాడటానికే తెగ ఇబ్బంది పడుతుంటారు. కేవలం వీళ్లిద్దరూ గ్లామర్ కోసమే ‘జబర్దస్త్’ తెరపై మెరిశారు. ఇక రష్మి.. హీరోయిన్గా కూడా నటించడంతో.. ఈమె పారితోషకం కూడా ఎక్కువే. ఒక్కో షోకి లక్ష నుంచి రెండు లక్షల వరకూ పారితోషకం తీసుకుంటుందట. సినిమా ఈవెంట్లు పెద్దగా చేయదు కానీ.. వాటికి రెండు నుంచి మూడు లక్షల వరకూ రేటు పలుకుతుందట.
ఇక రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలకు.. ప్రైవేట్ ఈవెంట్స్‌కి పిలిస్తే మాత్రం రోజుకి రూ.5 లక్షల పైమాటేనట. సినిమాకి రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ డిమాండ్ చేస్తుందట. మొత్తానికి యాంకర్ రష్మి.. నెల సంపాదన రూ.50 లక్షలు పైనేనట. రేటు విషయంలో రాములమ్మ స్పీడు యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోయే బుల్లితెర యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అయితే ఎంటర్ టైన్మెంట్ పరంగా ఇద్దరి కంటే శ్రీముఖి కాస్త బెటర్ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు మాట్లాడే విషయంలో. బుల్లితెరపై రాములమ్మ స్పీడ్‌కి తగ్గట్టుగానే పారితోషకం కూడా ఉంది. ఒక్క షోకి లక్ష నుంచి రెండు లక్షలు తీసుకుంటుందట.
అలాగే ఈవెంట్‌కి రూ.3-4 లక్షలు పారితోషకం చార్జ్ చేస్తుందట. ఇక స్పెషల్ ఈవెంట్లు.. షాప్ ఓపెనింగ్స్‌కి అయితే స్టార్ యాంకర్ల మాదిరిగానే.. రోజుకి రూ.5 లక్షల వరకూ చార్జ్ చేస్తుందట యాంకర్ శ్రీముఖి. ఇక సినిమాల్లో నటించిన శ్రీముఖి.. పాత్ర నిడివి, ప్రొడక్షన్ కంపెనీని బట్టి పారితోషకం తీసుకుంటుందట. ఒక్క సినిమాకి గానూ.. పది లక్షల నుంచి పాతిక లక్షల వరకూ చార్జ్ చేస్తుందట. మొత్తంగా మన రాములమ్మ నెల సంపాదన కోటి పైమాటేనట…