అదేంటీ ఎక్కడో మధ్యప్రదేశ్ లో పుట్టి ప్రధానిగా ఎడిఫైనా వాజపేయికి కేరళ వరదలకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా , ఉంది ఆయనకీ కేరళ వరదాలకీ సంబంధం ఏమిటంటే 1924లో కేరళను భీకర వరదలు ముంచెత్తాయి. అదే ఏడాది వాజ్‌పేయి జన్మించారు. మూడు వారాల పాటు నిరంతరాయంగా కురిసిన వర్షాలకు పెరియార్ నది విలయం సృష్టించింది. కేరళలోని చాలా జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టించింది. త్రిసూర్ , ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం లాంటి ప్రాంతాలు వరద దెబ్బకి విలవిల్లాడాయి. కరింతిరి మలై అనే కొండ కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. మున్నార్ ప్రాంతానికి వేసిన రోడ్డు వరదలో కోసుకు పోయింది.
అంతేకాక మలయాళీయుల క్యాలెండర్ ప్రకారం.. ఆ ఏడాది వారికి 1099 సంవత్సరం. దీంతో వారు దాన్ని ‘గ్రేట్ ఫ్లడ్ 99’గా పిలుస్తారు. ఆశ్చర్యకరంగా అదే ఏడాది డిసెంబర్ 25న వాజ్‌పేయి జన్మించారు. మళ్లీ ఇప్పుడు కూడా కేరళలో వరద విలయం సృష్టిస్తోంది. సుమారు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2 కోట్ల మందిపై ప్రస్తుత వరదలు ప్రభావం చూపుతున్నాయి. మలయాళీలు ఈ వరదలను చూసి ‘గ్రేట్ ఫ్లడ్ 99’ మళ్లీ వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. అయితే, అప్పుడు వరదల ఏడాదిలో వాజ్‌పేయి పుట్టారు. ఇప్పుడు అదేస్థాయి వరదలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. అదే సమయంలో వాజ్‌పేయి కన్నుమూశారు.