కోట్లాది మంది యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యాప్ ను వాడుతున్నారు . ఇందులో తాజాగా సరికొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. దీని స్క్రీన్ షేరింగులో సహాయపడే ఫీచర్‌ను వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో ద్వారా కంపెనీ పరిచయం చేసింది. ఈ ఫీచర్ గతంలో బీటా టెస్టింగులో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను వాట్సాప్ స్టేబుల్ అప్డేట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మీ స్క్రీన్‌ని ఫోన్ లేదా PC డిస్ప్లేను అందరూ చూసేలా షేర్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంటుంది.సాధారణంగా ఆన్లైన్ మీటింగ్సులో పిసి లేదా లాప్‌ట్యాప్‌లలో స్క్రీన్ షేర్ చేయడం, సమాచారం షేర్ చేసుకోవడం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాట్సాప్ యాప్‌లోనూ అలాంటి ఆప్షన్ వచ్చింది. మీతో ఉండే ఆండ్రాయిడ్, iOS పరికరాలలో WhatsApp ఉపయోగించి స్క్రీన్ షేరింగ్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. స్క్రీన్ షేర్.. ముఖ్యంగా ఆఫీసు మీటింగులకు ఇదొక చక్కని టూల్ అని చెప్పొచ్చు.
అంతేకాదు మీరు చూస్తున్న కంటెంట్‌ను మీ మిత్రులు, బంధువులతో కూడా షేర్ చేసుకోవచ్చు. గట్టి పోటీ ఇవ్వనుంది.. ఈ కొత్త ఫీచర్ ను సంబంధించిన అప్డేట్ను మెటా సిఇఒ మార్క్ జూకర్ బర్గ్ ఫేస్బుక్ పోస్టు ద్వారా స్పష్టం చేశారు. ఈ కొత్త ఫీచర్ వల్ల జూమ్ , గూగుల్ మీట్ వంటి యాప్స్‌కు వాట్సాప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపై కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ను చాలా మంది వాడే అవకాశం ఉంది. వాట్సాప్ వీడియో కాల్‌తో లాభాలు.. ఫోన్లో ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఫొటోలు ఇతర కంటెంట్‌ను సులభంగా చూడొచ్చు. కాల్స్ మధ్యలో చర్చలు కూడా జరపొచ్చు.
మీ కుటుంబం, స్నేహితులకు ఈ ఫీచర్ ద్వారా ఈజీగా టెక్నికల్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఫోన్లో ఏదైనా కొత్త వాటిని మీ పేరేంట్స్ కోరుకుంటే, దశలవారీగా ఏమి చేయాలో,వాటిని స్క్రీన్ షేర్ చేసి స్పష్టంగా చెప్పొచ్చు. కంట్రోల్ పూర్తిగా మీకే..! వాట్సాప్ యూజర్లకు స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌పై పూర్తి నియంత్రణ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతో సెక్యూరిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఎలా షేర్ చేసుకోవాలంటే.. ముందుగా వీడియో కాల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, వాట్సాప్ స్క్రీన్ షేర్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అందులో మీకు ‘షేర్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్ ప్రస్తుతం తన యూజర్లకు రెండు రకాల ఆప్షన్లను ఇస్తోంది. ప్రస్తుతం ఒక్క వీడియో కాల్లో 32 మంది వరకు మాట్లాడుకోవచ్చు. చిన్న సమావేశాలకు ఇది సరిపోతుంది.