టాలీవుడ్ కు యువ నటీనటుల్ని పరిచయం చేసి హిట్ కొట్టడంలో దర్శకుడు శేఖర్ కమ్ములకి ఒక ప్రత్యేక మార్క్ ఉంది. తన మొదటి మూవీ నుంచి కూడా ఇప్పటికీ తన మూవీ ల్లో మ్యాజిక్ తో ఎంతగానో అలరించే తాను చేసిన హిట్ మూవీ ల్లో ఒక సమయంలో యూత్ అంతటినీ ఎంతగానో ప్రభావితం చేసిన సెన్సేషనల్ హిట్ మూవీ “హ్యాపీ డేస్” కూడా ఒకటి. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, వెంకట్ తదితర యంగ్ నటీనటులు చేసిన ఈ మూవీ భారీ వసూళ్లతో కూడా అదరగొట్టింది.

When will “Happy Days” hit the theaters again?
అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దానికి ముందు ఈ మూవీ థియేటర్స్ లో మరోసారి అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఎప్పుడు నుంచో ఈ మూవీ రీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఫైనల్ గా ఆ డేట్ రానే వచ్చింది. ఈ మూవీ ని గ్లోబల్ సినిమాస్, అమిగోస్ క్రియేషన్, ఆసియన్ సినిమాస్ వారు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. మరి దీనికి గాను ఈ ఏప్రిల్ 12ని అయితే లాక్ చేశారు.
మరి అప్పుడు చూసిన వారు అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకునేవారు అయితే ఈ మూవీ ని చూడాలి అనుకుంటే ఈ డేట్ వరకు ఆగితే సరిపోతుంది. ఇక ఈ మ్యాజికల్ హిట్ కు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.
Everyone's favorite #HappyDays is bringing us back to our college days 😍
Let's relive those moments once again in theaters from April 12th
A @sekharkammula film 🥳
AP/TS Release by @CinemasGlobal@AsianCinemas_ @amigoscreation pic.twitter.com/0wSkAQNcce
— Asian Cinemas (@AsianCinemas_) March 26, 2024






