ఈ మధ్య కాలంలో విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఓ చిన్న సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. చాలా రోజుల తరువాత ఒక మంచి ఫ్యామిలీ మూవీ వచ్చిందని ప్రేక్షకులు ఆ మూవీ చూసేందుకు బ్రహ్మరథం పడుతుంటే. మరో వైపు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ప్రముఖ రెండు ఓటీటీ సంస్థలు మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నాయి.
శ్రీవిష్ణు హీరోగా, రెబ్బా మోనికా జాన్ హీరోయిన్ గా, సీనియర్ నటుడు నరేష్ , వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సామజవరగమన మూవీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. గతంలో రామ్ అబ్బరాజు దర్శకత్వం లో కమెడియన్ సత్యను హీరోగా పరిచయం చేస్తూ వివాహ భోజనంబు సినిమా మంచి విజయాన్ని సాధిచింది . AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీని ప్రజెంట్ చేయగా.. రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మంచి కామెడీ, నైతిక విలువలతో ఈ చిత్రం అందరినీ కడుపు ఉబ్బా నవ్వించగా అదే పాజిటివ్ టాక్ తో జూన్ 29న సామజవరగమన థియేటర్స్ లో విడుదలైంది. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు పెద్దగా ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలు కాకపోవడం తో చాలా రోజుల తరువాత వచ్చిన కుటుంబ కథా చిత్రం అవ్వడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. విడుదలకు ముందే కొనడానికి బయ్యర్స్ లేని ఈ సినిమాకి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇప్పటివరకు రూ.47కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా థియేటర్స్ మంచి యాక్యుపెన్సీ తో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీని 10 డేస్ లో నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆహా టీమ్ పోస్ట్ ని విడుదల చేసారు . ఇంకా సినిమాలు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలలో విడుదల చేసేందుకు ఉత్తమమైన పని అని అభిమానులు అనుకుంటున్నారు .