మందుకోసం ఇంత తెగింపు: వడదెబ్బకు వ్యక్తి మృతి.

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. దీంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. వైన్ షాపులు మూతపడ్డాయి. కాస్త వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ఎట్టకేలకు ఈరోజు మద్యం షాపులు తెరుచుకున్నాయి. ధరల పట్టికలు రావడం ఆలస్యం కావడంతో ఏపీలో మధ్యాహ్నం దాటాక వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మందుబాబులు ఎండను కూడా చేయకుండా క్యూలో నిలబడ్డారు.ఇంట్లో ఏం చూసినా మందే గుర్తొచ్చెది అని వాపోతున్నారు.

అయితే గతంలో కంటే 25 శాతం ధర ఎక్కువ పెంచినప్పటికీ.. ఎంత పెరిగినా పట్టించుకోకుండా మందుబాబులు మద్యం షాపుల ముందు కొలువు దీరారు. చాలా రోజులు తర్వాత గొంతు తడి చేసుకొనే అవకాశం రావడంతో వైన్‌ షాపుల ముందు క్యూ కట్టారు. కాగా నెల్లూరు జిల్లా పొదలకూరులోమద్యం కోసం క్యూలైన్ లో నిల్చోని వడదెబ్బకు గురైన పోలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 195 మద్య దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అయితే జనాలు ఎక్కువగా గుమికూడుతున్నారనే కారణంతో 14 దుకాణాలను మూసి వేశారు. ఇక 181 దుకాణాలలో అమ్మకాలు చేయగా రెండు కోట్ల మేర అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో మద్యం కొసం రావడంతో తడలో రెండు దుకాణాలు క్లోజ్ చేసినట్లు సమాచారం అందుతుంది.