వైసీపీ అధినేత జగన్, నందమూరి నటసింహం బాలకృష్ణ ల మధ్య పోలిక ఏంటని అడిగితే సహజంగా వచ్చే జవాబు…” ఇద్దరికీ కాస్త నోటి దూకుడు“. అంతకుమించి ఇంకో పోలిక కూడా వుంది. అదేంటో తెలుసా ? ఈ ఇద్దరూ సుదీర్ఘ కాలం పాటు ఒకే పిలుపు చూసి సంబరపడ్డారు. అయితే ఇప్పుడు బాలయ్యకి ఆ పిలుపు కాస్త దూరం అయ్యింది. అదే బిరుదు ని బాలయ్య నుంచి జగన్ ఒక్కడే సొంతం చేసుకోవడం చూసి వైసీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకి సీఎం పదవి బదలాయిస్తున్న తరుణంలో నటుడు బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాలకు బాలయ్య దూరంగా ఉండిపోయారు. మళ్లీ కూతురు బ్రాహ్మిణిని లోకేష్ కి ఇచ్చి చేశాకే బాలయ్య రాజకీయాల వైపు కాస్త దృష్టి పెట్టారు. ఇక 2014 ఎన్నికల్లో నేరుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ లో క్రియాశీల పాత్ర పోషించాలని నందమూరి అభిమానులు కోరుకున్నారు. ఆ మధ్య కాలంలో బాలయ్య ఎక్కడ కనిపించినా ఆయన ఫాన్స్ కాబోయే సీఎం అని పెద్ద ఎత్తున నినాదాలు చేసేవాళ్ళు. ఈ వ్యవహారం చాలా కాలం నడిచింది. కొన్ని సినిమాల్లో సైతం ఈ డైలాగ్ పెట్టారు. బాలయ్య ఆ నినాదాలు విని నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. కానీ చంద్రబాబుకు వియ్యంకుడు అయ్యాక ఫాన్స్ నినాదాల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. బాబు తర్వాత లోకేష్ రాజకీయ వారసుడు అని తేలడంతో బాలయ్య సైలెంట్ అయిపోయారు.
ఇక ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా అదే డైలాగ్ వినిపిస్తోంది. ఒకవేళ అభిమానులు మర్చిపోయినా జగన్ స్వయంగా తానే కాబోయే సీఎం అని చెప్పుకుంటారు. ఆ రికార్డు కూడా చెప్పి చెప్పి అరిగిపోయింది. అందుకేనేమో వైసీపీ సోషల్ మీడియా టీం ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధతో seo ద్వారా ఏపీ కి కాబోయే సీఎం ఎవరు అని గూగుల్ లో టైపు చేస్తే జగన్ పేరు వచ్చేలా చేయగలిగారు. అది చూసుకుని వైసీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. కానీ జగన్ ఎప్పటికీ కాబోయే సీఎం గానే మిగులుతాడు గానీ సీఎం కాలేడని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. పైగా బాలయ్య సెంటిమెంట్ చూసుకున్నా కాబోయే సీఎం బిరుదు పెద్దగా అచ్చివచ్చినట్టు లేదు.