Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో ఎన్నికల వేడి ఊపందుకుంటునన సమయంలో పవన్ కల్యాణ్ ఇంటికి జేడీఎస్ నేత కుమారస్వామి వచ్చి పవన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాదాన్యత లేదని వారు బయటకి చెప్పినా రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సినిమాలుతో పాటు రాజకీయాల మీదే చర్చ జరిగినట్టు ప్రచారం సాగింది. అయితే ఎప్పటి నుండో ఉన్న మిత్రత్వం కారణంగా కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రచారానికి పవన్‌ను కుమారస్వామి ఆహ్వానించారు. దానికి పిలిచింది పాత స్నేహితుడే కదా అని పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారు. కానీ తదనంతర పరిస్థితుల్లో పవన్ బీజేపీకి ఒకరకంగా రహస్య పార్టనర్‌గా మారడంతో కుమారస్వామికి ఇచ్చిన హామీని మర్చిపోయారు. అంతేనా.. ఎలాగైనా బీజేపీనే అధికారంలోకి వస్తుందంటూ అంతెందుకు ఫలితాలు వచ్చాక యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయాగానే ఇదంతా తనకు ముందే తెలుసునని ఒక సర్వాంతర్యామి లాగా బీజేపీ వైపున మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
బీజేపీకి వైపు మాట్లాడినంత బాగా కుమారస్వామికి మద్దతుగా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యి కుమారస్వామికి సిఎం అవకాసం వచ్చింది. దీనీ మీదా పవన్ ఏమీ స్పందిన్చలేదు అయితే ఈ పరిస్థితుల్లో మరో కొత్త వాదన తెరమీదకి వస్తుంది. అదేంటంటే ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్, మమతా బెనర్జీ వంటి తన పాత మిత్రులకి తన ప్రమాణ స్వీకారినికి ఆహ్వానాలు పంపిన కుమారస్వామి పవన్ ని ఎందుకు ఆహ్వానించలేదా అని. దీనికి కారణం కుమారస్వామి పవన్ ని నమ్మకపోవడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ముందు నుండి పవన్ ని తన స్నేహితుడిగా భావిస్తే హ్యాండ్ ఇచ్చాడని ఇప్పుడు ఇంకెలా ఆహ్వానిస్తామని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమయినా చంద్రబాబు సీఎం కావడానికి నేనే కారణం అని చెప్పుకుంటున్న పవన్ కుమారస్వామి ని సీఎం చేసానని చెప్పునే చాన్స్ మిస్ అయ్యిందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.