Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులకు ‘బద్రీ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యి, ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడి, ఆయన్ను ప్రేమకు ఒప్పించి, అతడితో సుదీర్ఘ కాలం సహజీవనం సాగించి, ఒక కొడుకును కూడా కన్నది, పెళ్లి కాకుండానే ఒక కొడుకుకు తల్లి అయిన రేణుదేశాయ్ ఆ తర్వాత పవన్‌కు భార్య అయ్యింది. పెళ్లి తర్వాత మరో పాపకు రేణు జన్మనిచ్చింది. వీరి సహజీవనం సాగినంత సంతోషంగా వైవాహిక జీవితం సాగలేదు. పెళ్లి అయిన కొన్నాళ్లకే వీరిద్దరి మద్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు విడాలకులకు దారి తీసింది. విడాకుల తర్వాత కూడా రేణుదేశాయ్‌తో పవన్ సన్నిహితంగానే ఉంటు వస్తున్నాడు. పిల్లల కోసం పవన్, రేణుదేశాయ్‌లు సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరు కలిసి పిల్లలను సంతోషంగా ఉంచుతున్నారు.
పవన్ కళ్యాణ్ వల్ల రేణుదేశాయ్‌కి అమితమైన క్రేజ్ దక్కింది. పవన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉన్న కారణంగా రేణుదేశాయ్‌కి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను ఇంకా కూడా పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో రేణుదేశాయ్ త్వరలో ‘నీతోనే డాన్స్’ అనే షోలో జడ్జ్‌గా వ్యవహరించబోతుంది. స్టార్ మాటీవీలో మొన్నటి వరకు ప్రసారం అయిన ‘బిగ్‌బాస్’ కార్యక్రమం స్థానంలో నీతోనే డాన్స్ షోను ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ షోకు రేణుదేశాయ్ కొత్త గ్లామర్‌ను అద్దింది. ఉదయభాను హోస్ట్‌గా, రేణుదేశాయ్, జానీ మాస్టర్‌లు జడ్జ్‌లుగా ఆ షో సాగబోతుంది.
రేణుదేశాయ్ ఈ షో ఎందుకు ఒప్పుకుని ఉంటుంది అనే విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. డబ్బు కోసం రేణుదేశాయ్ ఈ షోను ఒప్పుకుని ఉంటుందా అని కొందరు భావిస్తున్నారు. కాని రేణుదేశాయ్ డబ్బు కోసం ఈ షోను ఒప్పుకోలేదని, తెలుగు ప్రేక్షకుల్లో ఆమె గుర్తింపు కోరుకుంటుందని, అందుకే ఈ షోను జడ్జ్ చేసేందుకు ముందుకు వచ్చిందని అంటున్నారు, రేణుదేశాయ్‌కి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనే కోరిక ఉంది. ఆ కోరికతోనే మొదట ఇలా డాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఈమె బుల్లి తెర నుండి వెండి తెరపై కూడా రీ ఎంట్రీ ఇస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఈమె నీతోనే డాన్స్‌కు ఓకే చెప్పి ఉంటుందని ఎక్కువ శాతం ప్రేక్షకులు సినీ జనాలు భావిస్తున్నారు. మరి ఏది నిజం అనే విషయం ఆమె చెప్తే కాని తెలియదు. ఒక వేళ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే ఖచ్చింగా మంచి పాత్రలు లభిస్తాయి అనడంలో సందేహం లేదు