భార్య అందంగా లేదని… గొంతు నులిమి చంపేశాడు…

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గల్ఫ్‌లో పనిచేసేప్పుడు పరిచయమై మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జాన్.. తన రాసలీలలకు భార్య అడ్డంగా మారిందని గొంతు నులిమి చంపేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది.

అయితే పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి భార్య అందంగా కనిపించలేదు. దీంతో తన సుఖానికి అడ్డుగా ఉందని భావించి ఆమె ప్రాణాలు తీసేశాడు. కడప జిల్లా గాలివీడు మండలంలోని పేరంపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెలో ఘటన చోటుచేసుకుంది. పర్వీన్ కు బాబ్‌జాన్‌ అనే వ్యక్తితో పదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి రెండేళ్ల లోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బాబ్‌జాన్‌ ఐదేళ్లుగా గల్ఫ్‌లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు.

కాగా తన భార్య అందంగా ఉండదని భావించే బాబ్‌జాన్‌ గల్ఫ్‌లో పరిచయమైన తన ప్రాంతానికి చెందిన మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆరు నెలల కిందట ఆమెను సొంతూరుకు తెచ్చి గాలివీడు గేటు సమీపంలో ఇల్లు తీసుకుని సహజీవనం స్టార్ట్ చేశాడు. మళ్లీ గల్ఫ్‌కు వెళ్లి రెండు నెలల క్రితం ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి తనకు విడాకులు ఇవ్వాలంటూ భార్య పర్వీన్‌ను వేధింపులకు గురిచేస్తున్నాడు. గతంలో ఓ సారి భార్యను చంపేందుకు ప్లాన్ చేసినా ఫలించలేదు. దీంతో ముస్లిం పెద్దల పండుగ రోజున ఇంట్లోని నగలు అమ్మేయడంతో పర్వీన్‌ భర్తతో గొడవపడింది. దీనిపై కక్ష పెంచుకున్న పర్వీన్‌ తాజాగా పర్వీన్ నిద్రపోతున్నప్పుడు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే తన సోదరిని భర్త జాబ్‌జాన్‌తో పాటు అత్తమామలు కలిసి హత్య చేశారని బాబ్జి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. పర్వీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ స్పష్టం చేశారు.