ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిందో మహా ఇల్లాలు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరంలో జరిగింది. రాజమహేంద్రవరం హుకుంపేటకు చెందిన వడ్డి ఇమ్మానియేలు తాపీ మేస్త్రీ ఆయనకు భార్య దేవి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇమ్మనియేలుతో పాటు శివ అనే యువకుడు కూడా ఆ పనికి వస్తుండేవాడు. ఈ క్రమంలో శివ అప్పుడప్పుడు ఇమ్మానియేల్ ఇంటికి వస్తుండేవాడు. దాంతో దేవి పరిచయమై వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే ఈ విషయం ఇమ్మానియేల్ కు మందలించాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. అయితే కుటుంబసభ్యులు భార్యభర్తలకు నచ్చజెప్పి భర్త ఇంటికి పంపించారు. అయితే దేవి పిల్లల్ని స్కూల్ కు తీసుకువచ్చే క్రమంలో మళ్ళీ శివతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం ఇమ్మానియేల్ తన స్నేహితుల ద్వారా తెలుసుకుని భార్యపై గొడవకు దిగాడు. ఆ తరువాత భర్తపై కోపాన్ని పెంచుకున్న దేవి విషయాన్నీ ప్రియుడు శివకు తెలియజేసింది. అతను మర్డర్ ప్లాన్ చెప్పాడు. జూలై 26న రాజమహేంద్రవరం మార్కెట్ సెంటర్‌కు రావాలని ఇమ్మానియేల్‌ను శివ కోరాడు.
అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గోకవరం మీదుగా రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని తాగారు. తరువాత భార్య దేవి కూడా ఆ చోటుకు వచ్చింది. ‘నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్’ అంటూ ఇమ్మానియేల్ భార్యను ప్రశ్నించాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే ఇమ్మానియేల్ మద్యం మత్తులో ఉన్నాడు. దేవి, శివలు కలిసి ఇమ్మానియేల్ గొంతు నొక్కి చున్నీతో గట్టిగా చుట్టడంతో మృతి చెందాడు. ఆ తరువాత పెట్రలో పోసి తగలబెట్టారు. భర్తను ఎవరో హత్య చేసారంటూ కుటుంబసభ్యులకు చెప్పింది.
వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు మొదలెట్టిన పోలీసులకి ఇమ్మానుయేలు మొబైల్ ఫోన్లోని సిమ్‌ను పడేసిన ఫోన్ కీలకమైంది. ఫోన్లో ఆఖరి మెసేజ్ శివది ఉండడం, సంఘటనా స్థలంలో ఉన్న మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ ఆధారంగా ఆ మద్యం షాపు వద్ద ఉన్న సీపీ ఫుటేజి, సీతపల్లి బాపనమ్మ గుడి వద్ద ఉన్న సీసీ ఫుటేజిల ఆధారంగా మృతుడు ఇమ్మానుయేలుతో శివ ఉండడం పోలీసులు గుర్తించారు. శివను పోలీసులు తమ స్టైల్లో ఆరా తీస్తే నేరం వెలుగులోకి వచ్చింది. దీంతో శివను, మృతుడి భార్య దేవిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరు స్తున్నామని సీఐ తెలిపారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.