ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. తాము బలపడటమే కాక ప్రత్యర్ధి పార్టీలను బలహీనం చేయడం కూడా ఈ రాజకీయాల్లో భాగం అయిపొయింది. ఒకపక్క చంద్రబాబు మరోఅపక్క జగన్మోహన్ రెడ్డి కూడా.. జనసేన పార్టీని గురి పెట్టారు. ఆ పార్టీ ప్రభావం తమపై పడకుండా విభిన్నంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ వ్యూహాలు ఇద్దరివీ భిన్నమైనవి. పవన్ కల్యాణ్ మావాడేనన్నట్లుగా చంద్రబాబు జనంలోకి సంకీతలు పంపే ప్రయత్నం చేస్తూడంగా పవన్ కల్యాణ్ చంద్రబాబు పార్టనరేనంటూ జగన్, సాక్షి మీడియా ప్రచారం ప్రారంభించేశారు. రెండూ ఒకటే అయినా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇప్పటి ఏపీలో రాజకీయాలు చూస్తుంటే వాటిని అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. నిన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.ఇందులో అనేక అంశాలపై ఆయన స్పందించారు. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వను అని మాత్రమే చంద్రబాబు చెప్పారు. ఒకపక్క తనను ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఓ వైపు ఘోరంగా విమర్శలు చేస్తూంటే కలసి పని చేసే ప్రశ్నే లేదని ఖండించాల్సిన సీఎం, నో కామెంట్ అనడంతో జనంలో అనుమానాలొస్తాయి. అదే సమయంలో జగన్, పవన్ కల్యాణ్ పోటీలోకి దిగుతోంది చంద్రబాబు ప్రొత్సాహంతోనే అనే విమర్శలు చేయడం మీద కూడా “తప్పేమిటి పవనోస్తే జగన్ కు నొప్పేమిటి..” అన్నట్లుగా స్పందించడంతో ఈ మాటలను అంది పుచ్చుకున్న మీడియా పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీతోనే అన్నట్లుగా ప్రచారం ప్రారంభించింది. ఓ రకంగా ఇది, పవన్ కల్యాణ్ కు టీడీపీ వైపు నుంచి వచ్చిన అతి పెద్ద గండం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలివిగా సమాధానం ఇవాలి లేకపోతే మళ్లీ టీడీపీ ముద్ర పడితే అసలుకే మోసం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కొంత కాలం కిందటి నుంచి పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు.
జనసేన నాలుగో ఆవిర్భావ సభ సమయంలో పవన్ చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేయక ముందు పవన్ కల్యాణ్‌ను జగన్ ఇష్టం వచ్చినట్లు విమర్శించేవారు. నాలుగో ఆవిర్భావ దినోత్సవం తర్వాత పవన్ బాబుకి ఎదురేల్లడం చూశాక విమర్శించడం లేదు. పవన్ కల్యాణ్ చంద్రబాబును తిట్టినంత కాలం వైసీపీ పవన్ పై పల్లెత్తు మాట అనలేదు. మళ్లీ కొన్నాళ్ళ నుండి జగన్ పవన్ పై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారు. అదే సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఫెయిలయ్యాయని టీడీపీ మంత్రులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు పవన్ అటు జగన్ కు ఇటు చంద్రబాబు కు సమాంతరంగా దూరం పాటిస్తున్నానని వ్యూహాత్మకంగా చెప్పాలి. ఏ పార్టీతోనూ కలిసే ప్రశ్నే లేదని స్వతంత్రంగా ఎదిగుతామని కాన్ఫిడెన్స్ ను అభిమానుల్లోకి, కార్యకర్తల్లోకి పంపించగలగాలి. జనసేన స్ట్రాంగ్అవ్వాలంటే కచ్చితంగా తాను ఏ పార్టీకి అనుబంధం కాదని నమ్మకం కలిగించాలి. కానీ తమకు అనుబంధమని టీడీపీ అదే నిజమని వైసీపీ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రెండింటి లక్ష్యం జనసేనను బలహీన పరచడమే. మరి ఈ రాజకీయ చదరంగంలో పవన్ ఏమవుతాడో పాపం.