బీఆర్ఎస్‌ని కృష్ణార్జునులు గెలిపిస్తారా?

Will Krishnarjuna win BRS?
Will Krishnarjuna win BRS?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గర నుంచి బిఆర్ఎస్ తెలంగాణలో తనదైన ముద్ర వేసింది. ఇప్పటివరకు బిఆర్ఎస్ రెండుసార్లు గెలిచి అధికారం చేపట్టింది. కే‌సి‌ఆర్ సొంత కృషితో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. సి‌ఎంగా సత్తా చాటారు. ఇక ఈసారి కూడా గెలిచే హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. అయితే బిఆర్ఎస్ అంటే కేసీఆర్ ఒక్కరే అని కొందరి అపోహ కానీ బిఆర్ఎస్ ను వెనుక ఉంటూ ముందుకు నడిపించే శక్తులు కేటీఆర్, హరీష్ రావు. గత రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వీరిద్దరు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఈ సారి కూడా ఇద్దరు అదే పనిలో ఉన్నారు.

ప్రతిపక్ష పార్టీల మాటలకు తూటాల వంటి సమాధానాలు ఇచ్చి మారు మాట్లాడకుండా చేయగల సమర్థులైన ఈ బావాబామ్మర్దులు..పార్టీ హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్నారు. మామకు తగ్గ అల్లుడు ఒకరైతే, తండ్రికి తగ్గ తనయుడు మరొకరు. కేంద్రం నుండి నిధులు సాధించాలన్నా, పెట్టుబడులను ఆకర్షించాలన్న, క్షేత్ర స్థాయిలో పార్టీని బలపర్చాలన్న, పార్టీలో విభేదాలు చక్కదిద్దాలన్న, ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలన్న.. ఈ బావాబామ్మర్దుల తీరు ప్రత్యకం.

వేరే పార్టీ నేతలు తమ పార్టీ వైపు ఆకర్షించాలని ఈ జోడి వ్యూహాలు ఎవరికి అర్థం కాదు. వీరిద్దరి అండతోటి కే‌సి‌ఆర్ నాలుగు నెలలు ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అసమ్మతి నేతలు భారీగా వలసలు ఉంటాయని కాంగ్రెస్ బిజెపి నేతలు ఆశించారు. కానీ కేటీఆర్, హరీష్ రావు వ్యూహాలతో కాంగ్రెస్, బిజెపి ఆశలపై నీళ్లు చల్లారు.

తెలంగాణలో బిఆర్ఎస్ ను నిలబెట్టేది ఈ కృష్ణార్జునులే అన్నది జగమెరిగిన సత్యం. మరి వీరి వ్యూహాలతో ఎన్నికల కురుక్షేత్రంలో బిఆర్ఎస్ కు విజయాన్ని చేకూరుస్తారా లేదా వేచి చూడాల్సిందే.