జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నారు. టీడీపీ మరో ఐదేళ్ల వరకు ఎలాంటి అధికారంలో ఉండదు. నామమాత్రపు సీట్లు తెచ్చుకుని అసెంబ్లీలో ఆ ప్రతిపక్ష హోదా సాధించింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సమయంలో ఆ పార్టీ కోసం జూనియర్ ఆలోచించడం అనేది తెలివితక్కువ పనే అయితే ఇప్పుడు జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి నాందీ పలుకుతుంది. దానికోసం ఓ భారీ యాడ్ చిత్రీకరించాలని చూస్తున్నారు. దీనికి అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటాడని జగన్ కు కొందరు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి కూడా ఆలోచనలో పడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగానే ఉంటుందని ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇది వర్కవుట్ అవుతుందని జగన్ కూడా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో ఏడాది పాటు ఇది తప్ప తన బుర్రలో ఇంకేదీ పెట్టుకునేలా కూడా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో అసలు బ్రాండ్ అంబాసిడర్ అనే పదానికి ఛాన్సే లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు మొత్తం వైసీపీలోనే ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన కొడాలి నానితో పాటు పిల్లనిచ్చిన మామ కూడా వైసీపీలోనే ఉన్నాడు. దాంతో ఎన్టీఆర్ ను ఎలాగైనా ఈ యాడ్ కోసం ఒప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.