కాకినాడ జిల్లా పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది . ఈసారి 86.34% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 2014లో 79.44%, 2019లో 80.92% కాగా, ఈసారి దాదాపు 5% పెరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిసినప్పటి నుంచి అందరి దృష్టి బాగా పిఠాపురంపై పడింది. వైసిపి తరఫున వంగా గీత బరిలో నిలిచారు.
మరి జూన్ 4న వెలువడే ఫలితాల ల్లో విజయం ఎవరిదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని కూటమి సభ్యులు అనుకుంటున్నారు. అయితే తామే గెలుస్తామని వైసిపి బాగా ధీమాగా ఉంది. మరెవరు గెలుస్తారో అనేది చూడాలి.