వైసిపిని భారీ మెజారిటీతో గెలిపించండి అని అంటూ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవి కోసం బన్నీ ప్రచారం చేస్తున్నారు . ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే శిల్పారవి నాకు మంచి మిత్రుడు అని అన్నారు. ఎప్పుడు కలిసినా నంద్యాల గురించే రవి చెప్తూనే వుంటారు.. ఐదేళ్ళలో రవి మంచి అభివృద్ధి చేశారని ఆయన వివరించారు.
నాకు రాజకీయాలతో సంబందం లేదు…కానీ నా స్నేహితులు ఎక్కడ ఏ రంగంలో ఉన్న వాళ్ళ కోసం నేను వెళ్తానని ప్రకటించారు అల్లు అర్జున్. శిల్పారవి 2019 లో పోటీ చేసినప్పుడు మెసేజ్ మాత్రమే పంపాను…కానీ ఇప్పుడు డైరెక్ట్ గా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని అన్నారు అల్లు అర్జున్. అవి మంచి మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం నాకుందని తెలిపారు అల్లు అర్జున్.