ఈ మధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు, వారి కుటుంబ సభ్యులు మరణిస్తున్న విషయం తెలిసందే . ముఖ్యంగా కోలీవుడ్ వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కోలీవుడ్ తో పాటు అన్నీ ఇండస్ట్రీల్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న విజయ్ ఆంటోని దాదాపు అందరికీ పరిచయమే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా అన్ని రంగాల్లో ఆయన ప్రతిభ ని చాటారు. అలాంటి మంచి పేరు ఉన్న స్టార్ హీరో ఇంట్లో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది.
విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబానికి తీరని శ్లోకం మిగిల్చింది. ఈయన కుటుంబ మాత్రమే కాదు.. కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీరా మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. మీరా కంటే ముందే మరిముత్తు మరణం కూడా కోలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇలా కోలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి .ఇండస్ట్రీ మొత్తం ఇలా విషాదంలో ఉందిపొతే .. అక్కడి మీడియా మాత్రం ఇందుకు విరుద్ధంగా చేస్తుంది. అయితే మీరాను చివరిసారిగా చూసేందుకు ప్రముఖులు చాలా మంది విచ్చేశారు.
ఇక ఇదే సమయంలో అక్కడి మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ వారు మైక్ పట్టుకొని వచ్చిన వారి ఇంటర్వ్యూలు తీసుకొని మరియు ఇలా మీడియా వ్యవహరించిన తీరుకు కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ లో ఏ ప్రముఖులు మృతికి సంబంధించిన ఘటనలకు మీడియాను అనుమతించం అంటూ నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా గారు ప్రకటన చేశారు. ఈ నిర్ణయాన్ని మీడియా కూడా గౌరవించాలని కోరారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గ మారింది. దీనిపై రకరకాలుగా చర్చలు సాగడం అనేది గమనార్హం.