టీనేజ్ కుర్రాడిని కిడ్నాప్ చేసి ‘అందుకోసం’ వాడుకుంటున్న తల్లీ కూతుళ్ళు !

కొన్ని వార్తలు వింటుంటే రానురాను పురుషుల నుండి మహిళలలకు, మహిళల నుండి పురుషులకి భద్రత ఉండదేమో అనిపిస్తుంది. నిన్నటికి నిన్న తను కాదన్నాడని తన మాజీ ప్రియుణ్ణి కట్టిపెట్టిమరీ రేప్ చేసిన వార్త మరువక ముందే తన 17 ఏళ్ల కుర్రాడిని ఓ తల్లీ కూతరు లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఒక వార్త వేలుగులోకి వచ్చింది. ఈమేరకు బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అందుతున్న సమాచారం ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల తల్లి, 22 ఏళ్ల ఆమె కూతురు కుర్రాడిని తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. మూడు నెలలుగా ఆ కుర్రాడు వారి వద్దే ఉంటున్నాడు. ఈ మూడు నెలలపాటు తల్లీకూతుళ్లు తన కుమారుడిని లైంగికంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో కుర్రాడి తండ్రి పేర్కొన్నారు.

అయితే ఆ మహిళ వితంతువా, లేదంటే భర్త నుంచి విడిపోయిందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. బాధిత కుర్రాడు కూడా చదువు ఆపేశాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. భారత చట్టాల ప్రకారం ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేశామని పోలీసులుతెలిపారు. మైనర్‌ను వ్యభిచారం కోసం వాడుకోవడం కిందకు ఈ సెక్షన్ వస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడి వయసు 17 సంవత్సరాల 6 నెలలని, అందుకే లైంగిక నేరాల నుంచి పిల్లలకు భద్రత (పోక్సో) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వివరించారు.