కరోనాపై ఆ మహిళ అంతపని చేసిందా…?

కోల్ కతాలో కరోనా వైరస్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మందికి కరోనా వచ్చిందంటూ అసత్య ప్రచారం చేస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. కోల్‌కతా నగరంలోని ఓ ప్రాంతంలో 15 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందంటూ ఓ మహిళ వాట్సాప్‌లో షేర్ చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు.. ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు మూర్ఖుల్లో ఎంతమాత్రం మార్పు రావడం లేదు.

తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసేలా సోషల్‌మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జ్యోతీష్‌రాయ్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ నయాఅలీపూర్‌ ప్రాంతంలో 15మందికి కరోనావైరస్‌ పాజిటివ్‌ తేలిందని.. ఆ విషయాన్ని ప్రభుత్వం దాచి పెట్టిందంటూ అసత్య సమాచారాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయడంతో సర్వత్రా కలకలం రేగింది. ఆ మహిళను పోలీసులు ప్రశ్నించడంతో ఒక్కసారి షాక్ కు గురైంది. సోషల్ మీడియాలో ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే… ఎవరీ వదులేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.