కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్డులో దారుణ హత్య జరిగింది. భార్య పుణ్యవతిని భర్త సంతోష్ గొంతు నులిమి హత్య చేశారు. మే నెలలో పుణ్యవతిని సంతోష్ వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
గత రాత్రి నుంచి ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానంతో పుణ్యవతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరచి చూడగా అప్పటికే పుణ్యవతి మృతిచెందినట్లు గుర్తించారు.