అమ్మ కాదు కామపిశాచి…ప్రియుడి మోజులో పడి చేయరాని పనులు…!

woman Harassed Her Daughter
హైదరాబాద్ లో ఓ మహిళ కన్నతల్లి అన్న పదానికే మాయని మచ్చ తెచ్చింది. ప్రియుడి మోజులో పడి నాలుగేళ్ల కన్నకూతురిని రాచి రంపాన పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆ ప్రియుడి చేత కూడా చినరికి నరకం చూపించింది. తమ సరసానికి అడ్డు వస్తోందని కన్న కూతురిని ప్రియుడితో కలసి కొట్టడంతో చేయి విరిగి రోదిస్తున్నా ఆమెలో మార్పు రాలేదు. చివరికి పాపం పండటంతో అధికారులు ఆ కసాయి తల్లిని కటకటాల వెనక్కు నెట్టారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బాలల హక్కుల సంఘం ద్వారా బాలికను చేరదీసి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. తల్లిని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన సరితకు ఆరేళ్ల క్రితం వెంకన్న అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి రేణుక(4) అనే పాప పుట్టింది. అయితే ఏడాదిన్నర క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కుమార్తెను తీసుకుని సరిత హైదరాబాద్ లోని ముసారాంబాగ్‌లోని ఈస్ట్‌ ప్రశాంత్‌నగర్‌ కు వచ్చేసి ఉంటోంది.
mother-harassing-doughter
ఈ నేపథ్యంలో 9 నెలల క్రితం ఆమెకు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి (35)తో పరిచయం ఏర్పడి అది అనైతిక సంబంధానికి దారితీసింది. దీంతో ఈ అక్రమ సంబంధానికి రేణుక అడ్డుగా ఉందని భావించిన సరిత చిన్నారిని చిత్రహింసలు పెట్టడం ప్రారంభించింది. తల్లే పాపను హింసించడంతో ప్రియుడు వెంకట్ రెడ్డి కూడా ఈ పాపను కొరికి శాడిజం చూపేవాడు.
mother-daughter
అమ్మ తప్ప ఇంకే లోకం తెలియని వయసులో ఏడుస్తూనే చిన్నారి ఈ బాధలన్నింటినీ భరించింది. సరిత, వెంకటరెడ్డి నిన్న తీవ్రంగా దాడి చేయడంతో చిన్నారి రేణుక ఎడమ చేయి విరిగిపోయింది. ఈ నొప్పి తట్టుకోలేని బాలిక గట్టిగా ఏడుస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి తెలిపారు. దీంతో ఆయన బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు సాయంతో బాలికను కాపాడి రెస్క్యూ హోమ్ కు తరలించారు. వీరిచ్చిన సమాచారంతో కసాయి తల్లి సరితను మలక్ పేట పోలీసులు అరెస్ట్ చేయగా, వెంకట్ రెడ్డి వ్రుత్తి రీత్యా లారీ తీసుకుని తమిళనాడు వెళ్ళాడని తెలుస్తోంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ప్రారంభించారు.