కారు ఢీకొట్టడంతో భార్య మృతి

కారు ఢీకొట్టడంతో భార్య మృతి

బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలోని ఎదులాబాద్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎదులాబాద్‌కు చెందిన బత్తుల హనుమాన్‌దాస్, భార్య నీరజతో ఘట్‌కేసర్‌ నుంచి ఇంటికి వెళుతున్నారు. ఎదులాబాద్‌ చౌరస్తా సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు ఎదుట వ్యతిరేక దిశలో వస్తున్న ఓ కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది.

గాయాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా నీరజ మార్గమధ్యలో మృతి చెందింది. హనుమాన్‌దాసును చికిత్స నిమిత్తం ఉప్పల్‌ శ్రీకార ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. అయితే మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.