Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఈరోజు ఓ మహిళ అలజడి రేపింది. ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని మాటలతో ఆమె అధికారులను కంగారు పెట్టింది. అనుమానాస్పదంగా అక్కడ తచ్ఛాడుతూ ఉండటంతో చివరకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలిస్ స్టేషన్‌కు తరలించారు.
సీఎం ఇంటి సమీపంలో ఆమె తచ్ఛాడుతుండగా ఎవరు నీవు అని భద్రతాధికారులు ఆరాతీయగా.. తను సచివాలయానికి వెళ్తున్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత చాలా సేపు ఆమె అక్కడక్కడే తిరగడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు. దీనికి ఆమె ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇచ్చింది. తానొక సీబీఐ అధికారిని అంటూ ఆమె పోలీసులను హడలుగొట్టింది.
ఆధారాలు చూపించమని అడగ్గా, తాను సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ భార్యను అని ఆమె పోలీసులకి మరో షాక్ ఇచ్చింది. అయితే ఆమె తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె దగ్గర ఉన్న పేపర్లను పరిశీలించగా.. అందులో ఆమె ఫొటో కింద ఎర్విన్ రీటా అనే పేరుంది. భర్త ప్లేస్ లో వీ.వీ లక్ష్మీనారాయణ గారూ అని వ్రాసి ఉంది. అరెస్ట్ చేసిన ఆమెని తాడేపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే ఆమెకు మతిస్థిమితం లేదని పోలీసులు భావిస్తున్నారు. దీని పై మరింత సమాచారం అందాల్సి ఉంది.