Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ ఈ మధ్య మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. తల్లితో కలిసి అనేక ఫంక్లన్లకు హాజరవుతోంది. ఎప్పుడూ తల్లి చేయిపట్టుకునే తిరుగుతోంది. ఐశ్వర్యారాయ్, ఆరాధ్య కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల తల్లీ కూతురు ఇద్దరూ కలిసి మంగళూరులో బంధువుల పెళ్లికి హాజరయ్యారు. ఒక డిజైన్ దుస్తులు ధరించి పెళ్లింట్లో వాళ్లిద్దరూ సందడి చేసిన ఫొటోలు నెట్టింట్లో షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరాధ్యబచ్చన్ ను విమర్శిస్తూ… అభిషేక్ ను ఉద్దేశించి ఓ మహిళ ట్వీట్ చేసింది. మీ కుమార్తె స్కూలుకు వెళ్లడం లేదా… అని ఆ మహిళ ప్రశ్నించింది. తల్లితో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకున్న ప్రతిసారీ పాఠశాల యాజమాన్యం ఎలా సెలవులిస్తోంది అని ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అంతటితో ఆగకుండా… మీరంతా బ్యూటీ వితవుట్ బ్రెయిన్ ఉంటే చాలనుకున్నారా… అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఆరాధ్య అందరి పిల్లల్లా సాధారణ బాల్యం గడపకుండా… ఎప్పుడూ అహంకారం ఉన్న తల్లి చేయి పట్టుకుని తిరుగుతుంటుంది అంటూ ఆ మహిళ ట్వీట్ చేసింది.
దీనికి అభిషేక్ బచ్చన్ హుందాగా బదులిచ్చాడు. మేడం… ఇప్పటివరకు నాకు తెలిసి దాదాపు అన్ని పాఠశాలల్ని వారాంతంలో మూసివేస్తారని, ఆరాధ్య వారంలోని మిగిలిన రోజుల్లో స్కూల్ కు వెళ్తోందని, మా వైపు నుంచి తప్పులేదని ట్వీట్ చేశాడు. మీ ట్వీట్ లో ఏదో పొరపాటు ఉంది చూసుకోండి అని ముక్తాయింపు ఇచ్చాడు. నిజానికి ఆరాధ్య బచ్చన్ పై మీడియా ఫోకస్ ఎక్కువ. ఐశ్వర్యతో కలిసి ఆరాధ్య ఎప్పుడు బయటకు వచ్చినా… ఆ చిన్నారిని తమ కెమెరాలో బంధించేందుకు ఫొటో గ్రాఫర్లు పోటీపడుతుంటారు. అలాగే ఐశ్వర్యారాయ్ కూతురు కాబట్టి ఏ ఫంక్షన్ కు వెళ్లినా ఆమే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. దీంతో ఆ చిన్నారి ఫొటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే నిజంగానే ఆ మహిళ చెప్పినట్టుగా ఆరాధ్య ప్రతి ఫొటోలోనూ తల్లి చేయి పట్టుకునే ఉంటుంది. ఇటీవలి ఫొటోల్లోనే కాదు… ఆమె పుట్టినతర్వాత తొలిసారి బయటి ప్రపంచానికి తీసుకువచ్చినప్పటి నుంచి ఆరాధ్య ఎప్పుడూ తల్లి వెంటే ఉంటుంది. తండ్రి అభిషేక్ బచ్చన్, తాత అమితాబ్, నాయనమ్మ జయాబచ్చన్ ఇలా ఎంతమంది కుటుంబ సభ్యులున్నప్పటికీ ఆరాధ్య మాత్రం తల్లినే అంటిపెట్టుకుని ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.