Election Updates: వైకాపా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న మహిళలు.. వెనుతిరిగిన MLA

Election Updates: Women who blocked Vaikapa's election campaign
Election Updates: Women who blocked Vaikapa's election campaign

వైకాపా ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో చొల్లంగి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనను శనివారం ఉదయం అడ్డుకున్నారు గ్రామస్థులు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ 45 రోజుల నుంచి దీక్షలు చేస్తే, ఈరోజు ఓట్ల కోసం గుర్తుకువచ్చామా అంటూ నిలదీశారు మహిళలు.

ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు, నాయకులు వారిపై దుర్భాషలాడటంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం గ్రామస్థులకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే.