భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ అర్హత సాధించాడు. నేడు జరిగిన క్వాలిఫైయర్స్ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు బల్లెం విసిరి ఈ సీజన్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. హంగేరి వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ క్వాలిఫైయర్స్ లో.. క్వాలిఫైయింగ్ గ్రూప్ – ఎ లో పోటీపడిన నీరజ్ చోప్రా 88.77 మీటర్లు విసిరాడు.
దీంతో ఫైనల్ కు కట్ ఆఫ్ మార్క్ 83 మీటర్లను అధిగమించడంతో ఫైనల్ కీ చేరాడు. ఇక ఆదివారం రోజు ఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఒలంపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల లో బంగారు పతకాలతో పాటు, డైమండ్ లీగ్ గోల్డ్ మెడల్ విన్నర్ గా నిలిచిన నీరజ్ ప్రపంచ తొలి టైటిల్ కోసం తహతలాడుతున్నాడు.